తెలుగు సినిమాలకు ఇంగ్లీష్, హిందీ పేర్లు ఇప్పుడు చాలా కామన్. అటువంటిదే ‘ది సెస్సో.’ దీనిలో యేష్ రాజ్, మౌపియా గౌస్వామి, ఈశ్వర్ పెంటి, పూజా రెడ్డి ప్రధాన పాత్రలు చేస్తున్నారు. యేష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రేమ, సెక్స్, బ్రేకప్ కథాంశంతో ఈ సినిమా తీశారని ట్రైలర్‌తో చెప్పేశారు. కనుక ఈ సినిమాతో యువత బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ సినిమాకు కథ, దర్శకత్వం: యేష్ రాజ్, సంగీతం: విశ్వదీప్, సినిమాటోగ్రఫీ: యూఎస్ విజయ్, ఎడిటింగ్: హరి చేస్తున్నారు.
అశోక్ మకిరెడ్డి, రవితేజ ఆర్ల ఎగ్జిక్యూటివ్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.