రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మైసా’ నుంచి ‘ఏనాటి వరమో నువ్వు...’ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. తండ్రీకూతుర్ల అనుబంధాన్ని చూపిస్తూ రహ్మాన్ వ్రాసిన ఈ పాటకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, కృష్ణ తేజస్విని ఆలపించారు.
ఈ సినిమాలో రష్మిక, సముద్రఖని, ఈశ్వరీ రావు, రావు రమేశ్, రాహుల్ రవీంద్రన్, శివ కందుకూరి, కార్తీక్ రంజిని, తారక్ పొన్నప్ప, నిధి సింగ్ తదితరులు నటిస్తున్నారు.
మైసాకు సంగీతం: జెక్ బిజోయ్, సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ, కొరియోగ్రఫీ: బృందా, యాక్షన్: కేచా, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేస్తున్నారు.
అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప, నిర్మాతలు, సహ నిర్మాత శ్రీకాంత్ రెడ్డి సాతి నిర్మించిన మైసా నవంబర్ 27న 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.