టాలీవుడ్ ‘సూపర్ హీరో’ తేజ సజ్జా ఓ ఇంటివాడవబోతున్నారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో తేజ సజ్జా, మౌర్యల వివాహ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి, పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
టాలీవుడ్‌కు చెందిన అగ్ర నిర్మాతలు, నటీనటులు, ప్రముఖ దర్శకులు కూడా ఈ వేడుకకు విచ్చేసి కాబోయే దంపతులను ఆశీర్వదించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా ప్రస్తుతం తన తదుపరి సినిమా ‘జాంబీ రెడ్డి 2 (డెడ్ ఆర్ ఎలైవ్)’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
2021లో విడుదలైన ‘జాంబీ రెడ్డి’ సినిమాకు ఇది సీక్వెల్. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ నటి షనాయా కపూర్ తెలుగు తెరకు పరిచయం కానున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గౌర హరి సంగీతం అందిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Superhero #TejaSajja gets engaged to Mourya in an intimate yet star-studded ceremony attended by family and close friends at Taj Krishna, Hyderabad! 💍❤️
Megastar #Chiranjeevi, Telangana Governor Shiv Pratap Shukla, Union Minister Kishan Reddy, Ministers, political leaders, top producers, stars and renowned directors from Tollywood graced the occasion and blessed the couple.
Wishing @tejasajja123 and Mourya a lifetime of love and happiness! ❤️✨
#TejaSajjaEngagement