మల్లాది వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా నటించిన ‘విశ్వంభర’ సినిమా ట్రైలర్ సిద్ధమైనట్లు దర్శకుడు వెల్లడించారు. త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తామని మల్లాది వశిష్ట చెప్పారు.
మళ్ళీ చాలా కాలం తర్వాత చిరంజీవి ఈ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ చేశారు. దీని తర్వాత చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతికి విడుదలై హిట్ కొట్టింది. దాని తర్వాత బాబీ దర్శకత్వంలో ‘కాకా’ మొదలుపెట్టారు. అది వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతోంది.
కానీ రెండున్నరేళ్ళ క్రితం మొదలుపెట్టి పూర్తి చేసిన ‘విశ్వంభర’ మాత్రం ఇంతవరకు విడుదల కాలేదు. ఇప్పుడు ట్రైలర్ వదిలితే దానిలో సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో వెల్లడిస్తారేమో?
ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, మౌనీ రాయ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.