వృషకర్మ: ఛలో పదవే... సాంగ్‌ ప్రమో

November 18, 2026


img

అక్కినేని నాగచైతన్య, మీనాక్షి చౌదరి జంటగా చేస్తున్న వృషకర్మ నుంచి ‘ఛలో పదవే..’ అంటూ సాగే రెండో పాట ప్రమో విడుదలైంది. అనంత శ్రీరాం వ్రాసిన ఈ పాటకు అజనీష్ బి లోక్‌నాధ్ సంగీతం అందించగా సాయి విగ్నేష్ ఆలపించారు.

కళ్ళు లేని ఒక బాలికకు ఈ ప్రకృతిని ఆస్వాదించేలా చేస్తూ సాగిన పాట ప్రేక్షకుల మనసులను కూడా కదిలిస్తుంది. పూర్తిపాట గురువారం సాయంత్రం 5 గంటలకు విదుల చేయబోతున్నట్లు ప్రమోలో తెలియజేశారు.    

కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌లో బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాత్సవ్ ఓ ముఖ్య పాత్ర చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్‌ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. 

బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్‌ నిర్మించిన వృషకర్మ డిసెంబర్‌ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష