కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మునుగోడులో నేడు జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి.. నీకు అధికారం ఉంది కదా అని నేను ఏం చేసినా నడుస్తది అనుకుంటే ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది. మూడేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు. తెలంగాణ అంటే కొడంగల్, మధిర మాత్రమే కాదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి. కానీ నిధులన్నీ కొడంగల్, మధిరకే తరలించుకుపోతున్నారు.
అధికారంలో ఉన్నవారు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలి తప్ప అహంకారం పనికి రాదు. నేను ప్రజల సొమ్ము తినే వ్యక్తిని కాను. అది వెయ్యి కోట్లు అయినా 5 వేల కోట్లు కాంట్రాక్ట్ అయినా నాకు అనవసరం. టెండర్ ఎంత ఉందో చెబితే దానికంటే 20 శాతం తక్కువకే టెండర్ వేసి పనులు చేయిస్తాను. ప్రజల డబ్బును కాపాడటమే నాకు ముఖ్యం. కమీషన్లు కావు,”అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
రాజగోపాల్ రెడ్డికి అసంతృప్తి, అసహనానికి కారణం మంత్రి పదవి దక్కకపోవడమే అని అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రభుత్వ కాంట్రాక్టుల విషయంలో కూడా తనకు ప్రాధాన్యత లభించడంలేదనే భావన అయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బహుశః అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన స్వరం మరింత పదునెక్కింది. ధిక్కార స్వరం వినిపిస్తోంది.
ఇంచుమించు ఈవిధంగా మాట్లాడినందుకే కొండ సురేఖ మంత్రి పదవి పోగొట్టుకున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి లేకపోవడం వల్లనే ఈవిధంగా మాట్లాడుతుండటం విశేషం. బహుశః పార్టీ మారేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయేమో?కానీ ఏ పార్టీలో?
రేవంత్రెడ్డి.. నీ అదృష్టం బాగుండి సీఎం అయ్యావు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
#Telangana #Congress #RevanthReddy #MunugodeMLA #KomatireddyRajGopalReddy #iNewsTelugu https://t.co/QLjQHj3gQy