కాకా.. ఇలా లీక్ చేశారేమిటి?

November 18, 2026


img

హైదరాబాద్‌లో జరిగిన ‘ఇట్లు అర్జున’ సక్సస్ మీట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ‘కాకా’ సినిమాలో తన కూతురు ‘అమ్ములు’గా నటిస్తున్న మళయాళ నటి అనస్వర రాజన్ పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. 

“అనస్వర చాలా అద్భుతంగా నటించింది. కానీ తన పాత్ర గురించి తాను మాట్లాడడు. మాట్లాడలేదు కూడా. ఎందుకంటే ఆమెను మాట్లాడటం నచ్చదు. అనస్వర పాత్ర గురించి నేను చెప్పాల్సింది చెప్పేశాను.. ఇక మీరే ఆలోచించుకొని అర్థం చేసుకోవాలి,” అని చిరంజీవి అన్నారు. 

అంటే ‘కాకా’ కూతురు మాట్లాడలేని మూగపిల్ల అని చెప్పకనే చెప్పెశారన్న మాట! వేదికపైనే ఉన్న అనస్వర ఓ చిరునవ్వుతో ధృవీకరించింది.  

బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’లో నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కే. చక్రవర్తి రెడ్డి, సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్, చేస్తున్నారు. 

డైలాగ్స్: భాను,నందు, యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్-లక్ష్మణ్, నబాకాంత్, ఎడిటింగ్: ఆంటోనీ రూబెన్, వీఎఫ్‌ఎక్స్‌: యుగంధర్ చేస్తున్నారు. 

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే. నారాయణ నిర్మిస్తున్న ‘కాక’ 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష