మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ‘కల్ట్’ అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైంది. కానీ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో థియేటర్లలో నిలదొక్కుకోలేకపోయింది. కనుక 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.
ఎటువంటి హడావుడీ లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. కనుక ఓటీటీ ప్రేక్షకులు కూడా చూసి తమ ‘కల్ట్’ తీర్పు చెప్పేస్తే ఓ పని అయిపోతుంది.
విశ్వక్ సేన్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విశ్వక్ సేన్, గాయత్రి భరద్వాజ్ జంటగా నటించారు. గోవా హోం మినిస్టర్ కొడుకు పుట్టినరోజు వేడుకల్లో ఒక వీడియో గేమ్ నడుస్తుంది. దానిలో ఓడిపోయినవారు వరుసగా హత్యకు గురవుతుంటారు.
ఆ పార్టీలోనే ఉన్న మన మాస్ కా దాస్ మిగిలినవారిని ఎలా కాపాడాడు? ఈ మిస్టరీ మర్డర్స్ ఏవిధంగా చేదించాడనేది క్లుప్తంగా ఈ సినిమా కథ. ఓటీటీలో చూసి ఈ సస్పెన్స్ ఏమిటో తెలుసుకోవచ్చు.