నాగచైతన్యకు జోడీగా సాత్విక వీరవల్లి

November 19, 2026


img

తెలుగు అమ్మాయి సాత్విక వీరవల్లికి టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆమె నటించిన తొలి సినిమా (ఆకాశంలో ఒక తార) విడుదల కాకముందే అక్కినేని నాగచైతన్య సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. 

ఈ విషయం నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా ప్రకటించారు. బన్నీ వాసుతో కలిసి గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించబోతున్న ఈ సినిమా నాగచైతన్య కెరీర్లో 25వ సినిమా. సాత్విక వీరవల్లి, ప్రియశంకర్ భవానీ వంటి కొత్త హీరోయిన్లతో ఎంట్రీతో ఇంతకాలం అగ్రస్థానంలో కొనసాగుతున్న పలువురు హీరోయిన్లు మెల్లగా అక్క, వదిన, తల్లి పాత్రలకు షిఫ్ట్ అవ్వాల్సిన సమయం వచ్చినట్లే ఉంది.     

దర్శకుడు క్లాక్స్ 'బెదురులంక 2012' సినిమాతో గుర్తింపు సంపాదించుకున్నారు. నాగ చైతన్య వంటి అగ్రనటుడుని డైరెక్ట్ చేసే అవకాశం దక్కడం అదృష్టం కాదు ఆయన ప్రతిభకు గుర్తింపుగానే భావించవచ్చు. 

నవంబర్ 23న నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ ‘ఎన్‌సీ25’పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన ‘వృషకర్మ’ డిసెంబర్ 4న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష