ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న ‘ఈగో రాజా’ టీజర్ నేడు విడుదలైంది. కోలీవుడ్ దర్శకుడు గురు శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సతీష్, శరణ్య రామచంద్రన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. లోన్ యాప్ కంపెనీలు ఏవిధంగా సామాన్య మద్య తరగతి ప్రజలను వేదిస్తున్నాయో ఈ సినిమాలో చూపబోతున్నట్లు టీజర్ చూస్తే అర్ధమవుతుంది. అయితే ఈ కథకు సంబంధం లేనట్లు ఈ సినిమాకు ‘ఇగో రాజా’ అని పేరు పెట్టడం విశేషం.
ఈ సినిమాలో ఆధా ప్రసాద్, గరుడ రామ్, ఆడుకాలం నరేన్, పరుత్తివీరన్ శరవణన్, ఆదిత్య కతిర్, శ్రీ రంజని, ఆతిర పాండిలక్ష్మి తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి కథ, దర్శకత్వం: గురు శరవణన్, సంగీతం: ఘిబ్రాన్ వైబోధ, సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, ఆర్ట్: జి. దురైరాజ్, స్టంట్స్: మహేష్ మాథ్యూ, విక్కీ నందగోపాల్, డాన్ అశోక్, ఎడిటింగ్: మేఘనాథన్ చేస్తున్నారు.
ఎస్‌జీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టీజర్ వచ్చేసింది కనుక త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల చేసి దానిలో సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తారేమో?