వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ‘ఇడుపు కాయితం’ నుంచి మరో చక్కటి పాట విడుదలైంది. హీరోహీరోయిన్ల వివాహవేడుకను చూపిస్తూ గోగులు గోగులు అంటూ సాగే ఈ పాటను కొంగరి కృష్ణ వ్రాయగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. అభిక్య తణికెళ్ల, తరుణి, రచిత రాయప్రోలు, జయశ్రీ పల్లెం, స్నిగ్ధ శర్మ కలిసి ఆలపించారు.
ఈ సినిమాలో మైమ్ మధు, అభయ్ బేతిగంటి, రచ్చ రవి, జోర్దార్ సుజాత, బిత్తిరి సత్తి, చంద్రవ్వ, శివజ్యోతి (తీన్మార్ సావిత్రి) తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రాఫి: ఎం.ఎస్.బాల్ రెడ్డి, ఆర్ట్: ఆశిష్ తేజ పుల్లెల,ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి చేశారు.
సుకుమార్ రైటింగ్స్, బీవీ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్, వంశీ రెడ్డి దొండపాటి, సురేష్ బొబ్బిలి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కాబోతోంది.