రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రష్మిక మందన ప్రధాన పాత్ర చేస్తున్న ‘మైసా’ నుంచి సూపర్ హిట్ సాంగ్ ‘ఒసేయ్ రాములమ్మ’ విడుదల చేశారు. అయితే ఈ పాట నేపధ్యంలో రష్మిక చేసిన పోరాటాలను ప్రధానంగా చూపారు.
ఈ సినిమా కోసం నీళ్ళ కింద, బురదలో ఆమె పోరాటాలు చేసిన సన్నివేశాల క్లిప్పింగ్స్ దీనిలో చూపారు. ఈ సినిమాలో అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా తిరగబడిన గిరిజన మహిళ ‘మైసా’గా రష్మిక నటించారు.
సుద్దాల అశోక్ తేజ వ్రాసిన ఈ పాటకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా వందేమాతరం శ్రీనివాస్, స్వర్ణలత కలిసి ఆలపించారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రవీంద్ర పుల్లె, సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా:శ్రేయాస్ కృష్ణ, స్టంట్స్: అండీ లాంగ్ చేస్తున్నారు.
అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోపా కలిసి మైసాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. నవంబర్ 27న మైసా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.