రష్మిక ‘మైసా’ నవంబర్‌ 27న కాదట!

November 22, 2026


img

రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రష్మిక మందన ప్రధాన పాత్ర చేస్తున్న ‘మైసా’ నవంబర్‌ 27న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. కారణాలు షరా మామూలే. 

‘మైసా’ను మరింత అత్యున్నత ప్రమాణాలతో, తెలుగు సినిమా చరిత్రలోనే ప్రత్యేకమైన యాక్షన్ స్పెక్టకిల్‌గా రూపొందించాలని భావిస్తున్నాం. ప్రేక్షకులకు థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని అందించడమే మా లక్ష్యం. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఈ సినిమా కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదని మైసా టీమ్‌ హామీ ఇచ్చింది.  

ఈ సినిమాలో రష్మిక మందన అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా తిరగబడిన గిరిజన మహిళ ‘మైసా’గా నటించారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రవీంద్ర పుల్లె, సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా:శ్రేయాస్ కృష్ణ, స్టంట్స్: అండీ లాంగ్ చేస్తున్నారు.  

అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోపా కలిసి మైసాని పాన్‌ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష