విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో నివేతా థామస్, తిరువీర్ ప్రధాన పాత్రలు చేస్తున్న ‘శ్రీమతి’ ట్రైలర్ విడుదలైంది. కోటి ఆశలతో భర్తతో కలిసి ఇంట్లో అడుగుపెట్టిన నూతన వధువు కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు సాగిందో ట్రైలర్‌లో చూపారు. కనుక ఇది ప్రతి ఇంటి శ్రీమతి కథ అంటూ ఈ సినిమా కథ ఏమిటో ముందే చెప్పేశారు.
ఈ సినిమాలో హరితేజ, గోపరాజు రమణ, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, రాజశ్రీ, ఐశ్వర్య భాస్కరన్, సుదర్శన్, విరాజ్ అశ్విన్, మానిక చిక్కాల తదితరులు నటించారు.
ఈ సినిమాకు సంగీతం: ఈ.ఎల్. విశ్వనాథ్, కెమెరా: ఆదిత్య జవ్వాడి, ఎడిటింగ్: రవితేజ గిరిజాల చేస్తున్నారు.
ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్స్, తెలుగు జీ ఒరిజినల్స్ బ్యానర్లపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి కలిసి నిర్మించిన శ్రీమతి డిసెంబర్ 4న విడుదల కాబోతోంది.