రవితేజ సినిమా టైటిల్‌ తులాభారం.. దానికో స్టోరీ!

October 11, 2026


img

మాస్‌ మహారాజా రవితేజ 78వ సినిమా టైటిల్‌ ‘తులాభారం’ అని ఖరారు చేశారు. అయితే దీనికి డాక్యుమెంటరీ అంటూ విడుదల చేసిన వీడియో, దానికి ముందు దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన విషయం రెండూ ఆసక్తికరంగా ఉన్నాయి. 

వివేక్ ఆత్రేయ ఏం చెప్పారంటే, ఇదివరకు నేను ‘అంటే సుందరానికి’ సినిమా రిలీజ్‌ ముందు కామెడీ అనుకుంటే డ్రామా అని తేలిందన్నారు. ‘సరిపోదా శనివారం’ రిలీజ్‌ ముందు జనం ‘సూపర్ హీరో’ సినిమా అనుకున్నారు. కనుక ఈసారి ఈ సినిమా దేని గురించో ముందే డాక్యుమెంటరీ స్టోరీతో చెప్పేస్తున్నాను,” అని అన్నారు.   

ఇక ఈ డాక్యుమెంటరీలో హీరో రవితేజ, హీరోయిన్‌ ప్రియాంక మోహన్, ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్న జేడీ చక్రవర్తి, తరుణ్ భాస్కర్‌ భాస్కర్, అనస్వర రాజన్ కూడా పాల్గొని ఈ సినిమా దేని గురించి అని చర్చిస్తూ ఇదొక క్రైమ్‌, రొమాంటిక్, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ సినిమాగా తేల్చేశారు. అన్నీ సమపాళ్ళలో ఉన్నాయి కనుక వీటిన్నిటినీ బ్యాలన్స్ చేస్తూ ‘తులాభారం’ అనే టైటిల్‌ బాగుంటుందని ఓకె చేసేశారు.      

ఈ సినిమాను బ్రిడ్జ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై లక్ష్మణ్‌, శ్రీనిరావు కలిసి నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష