విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘నాన్నకుట్టి’ విడుదల తేదీ ఖరారైంది. దీపావళి కానుకగా నవంబర్ 6న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
‘నాన్న కుట్టీ’ పేరులోనే ఇది తండ్రీకూతుర్ల సెంటిమెంట్ సినిమా అని స్పష్టమవుతోంది. రిలీజ్ డేట్ పోస్టర్‌తో కూడా అదే చెప్పారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ, ప్రీతి జంటగా నటిస్తున్నారు. హరిప్రియా, యాక్టర్ బక్స్, అరువి మదన్, ముత్తుకుమార్, దివాకర్ జి.జె., లిజ్జీ ఆంటోనీ, మున్నార్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాకు కథ, దర్శకత్వం: ముమరన్, సంగీతం, ఎడిటింగ్: విజయ్ ఆంటోనీ, ఆర్ట్: ఏ రాజా చేశారు.
విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ తమిళంలో ఈ సినిమా నిర్మించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై రామాంజనేయులు జవ్వాజి తెలుగు వెర్షన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.