‘అహ్‌’ నుంచి ‘ఇదేనా ఇదేనా’ వీడియో సాంగ్‌ విడుదల

October 09, 2026


img

రాహుల్‌ విజయ్‌, అర్చనా అయ్యర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘అహ్‌’. ఈ సినిమాలోని ‘ఇదేనా ఇదేనా’ లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది. 

ఈ పాటకు శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించగా, షణ్ముఖ భారద్వాజ్‌ ఆలపించారు. శ్రీచరణ్‌ పాకాల అదనపు గాత్రాన్ని అందించారు. సుమన్‌ చిక్కాల సాహిత్యం రాశారు.

సాయి బాలీ దర్శకత్వంలో స్టార్‌ బాక్స్‌ స్టోరీస్‌, రిపుల్‌ స్లైడ్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై కనకరావు తొనంగి, అభిషేక్‌ కె, గ్యారీ బీహెచ్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: శ్రీచరణ్‌ పాకాల , కెమెరా: మోనిష్‌ భూపతి రాజు, ఎడిటింగ్‌: వి. కునపరెడ్డి, గ్యారీ బీహెచ్‌ చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 30 న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష