పండగ వాతావరణంలో ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు

October 09, 2026


img

నేడు తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు పండగ వాతావరణంలో జరుగుతున్నాయి. కేసీఆర్‌ హయంలో    ఆర్టీసీ సమ్మె తర్వాత ఆర్టీసీలో కార్మిక సంఘాలన్నిటినీ అనధికారికంగా నిషేదించారు.

అప్పటి నుంచి అంటే గత ఎనిమిదేళ్ళుగా ఆర్టీసీ గుర్తింపు సంఘానికి ఎన్నికలు జరుగలేదు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. చాలా ఏళ్ళ తర్వాత నేడు ఈ ఎన్నికలు జరుగుతున్నందున ఆర్టీసీ ఉద్యోగులు చాలా సంతోషంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 

శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరుగుతుంది.  ఆ తర్వాత అక్టోబర్‌ 14, 15 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ నిర్వహిస్తారు. అక్టోబర్ 17వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. 

ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న పలు సంఘాలు ఆర్టీసీ సంస్థ, ఉద్యోగులకు సంబంధించి పలు అంశాలపై హామీలు ఇచ్చాయి. వాటిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ, ప్రభుత్వం నుంచి బకాయిల విడుదల, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వైద్య సదుపాయాలు, నియామకాలు తదితర అంశాలున్నాయి. కనుక ఈ ఎన్నికలలో గెలిస్తే సరిపోదు. ఈ హామీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అన్నీ సాధించుకోవాల్సి ఉంటుంది. 



Related Post