రణబాలి ట్రైలర్‌.. చూశారా?

October 09, 2026


img

విజయ్ దేవరకొండ, రష్మిక భార్యాభర్తలు నటించిన ‘రణబాలి’ ట్రైలర్‌ విడుదలైంది. బ్రిటిష్ కాలంలో జరిగిన అరాచకాలను ట్రైలర్‌లో కళ్ళకు కట్టినట్లు చూపారు. అలాగే విజయ్‌ దేవరకొండకు సరైన పాత్ర లభిస్తే ఎంత అద్భుతంగా నటిస్తారో ట్రైలర్‌ చూస్తే అర్ధమవుతుంది.

రాయలసీమలో బ్రిటిష్ వారిని ఎదిరిస్తూ జరిగిన స్వాతంత్ర్య పోరాటాలతో నేపధ్యంతో ఈ సినిమా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు కథ: ప్రమోద్ తమ్మినేని, సంగీతం: అజయ్-అతుల్, కెమెరా: నీరవ్ షా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్‌, ఆర్ట్: వితల్ కొసనం, స్టంట్స్: యానిక్ బెన్, అండీ లాంగ్ గుయెన్, రాబిన్ సుబ్బు చేస్తున్నారు.  

గుల్షన్ కుమార్‌, భూషణ్ కుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి నిర్మిస్తున్న రణబాలి అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.



Related Post

సినిమా స‌మీక్ష