ఈ నెలాఖరున ఆదర్శ కుటుంబం రిలీజ్‌?

October 07, 2026


img

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌ హీరోగా సిద్దం చేసిన ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నం: 47’ మొదట అక్టోబర్ 2న విడుదల చేయాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వలన అక్టోబర్ 9కి వాయిదా పడింది. కానీ ఆరోజు కూడా విడుదల చేయలేమని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పేశారు. 

వెంకటేష్‌ విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే అయనతో మాట్లాడి రిలీజ్‌ డేట్ ప్రకటిస్తామని చెప్పారు. ఈలోగా సంగీత దర్శకుడు తమన్ అక్టోబర్ 30న విడుదల కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి మళ్ళీ వెంటనే తేదీని తొలగించి ఇమోజీ పెట్టారు. ఇదీ ఓ రకం సినిమా ప్రమోషన్ అనుకోవాల్సి ఉంటుంది.

అక్టోబర్ 30న విడుదల చేస్తున్నట్లు తమన్ హింట్ ఇచ్చారంటే, అదే రోజు సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ అక్టోబర్ 9 నుంచి 30కి మారితే చాలా ఆలస్యమవుతుంది. కనుక రిలీజ్‌ డేట్‌పై పునరాలోచన చేసే అవకాశం ఉంది. త్వరలోనే సినిమా ఎప్పుడు విడుదల చేసేది అధికారిక ప్రకటన చేయక తప్పదు. కనుక అంతవరకు ఈ ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి.   

ఈ సినిమాలో వెంకటేష్‌ భార్యగా శ్రీనిధి శెట్టి, వారి కుమార్తె సంపూర్ణగా యువినా పార్ధవి, పోలీస్ ఆఫీసరుగా నారా రోహిత్ నటిస్తున్నారు. రావు రమేష్,  బ్రహ్మాజీ, పూజిత పొన్నాడ, నికితిన్ ధీర్, ఉదయ్‌బీర్ సంధు తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్; సంగీతం: తమన్, కెమెరా: రవి కే చంద్రన్; యాక్షన్: కేవిఎన్ కుమార్‌; ఆర్ట్: ఏఎస్. ప్రకాష్; ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్ చేశారు. 

క్రైమ్-ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించారు.


Related Post

సినిమా స‌మీక్ష