కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’.. డిసెంబర్‌ 25న చూడొచ్చు

October 06, 2026


img

కిరణ్‌ అబ్బవరం మంచి నటుడుగా నిరూపించుకున్నారు. ఇప్పుడు మంచి సినీ రచయితగా, దర్శకుడుగా నిరూపించుకోబోతున్నారు తాను హీరోగా నటిస్తున్న ‘రియాలిటీ’ సినిమాతో. 

నేడు విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్‌లో ఓ చిన్న హోటల్ నడిపిస్తున్నట్లు చూపారు. ఏ అప్పు లేనిరోజే జీవితంలో చాలా సంతోషకరమైన రోజని హీరో చెప్పిన డైలాగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఓ యువకుడి కథే ఈ సినిమా అని చెప్పేశారు.  

కిరణ్‌ అబ్బవరం, దేవికా భట్‌, శరత్‌ కుమార్‌, సాయికుమార్‌, రమేష్‌ ఇందిర, అన్నపూర్ణమ్మ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు.

జాయ్‌ ఫిల్మ్స్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సుధాకర్‌ చాగంటి నిర్మిస్తున్న ఈ సినిమాకు కథ, దర్శకత్వం: కిరణ్‌ అబ్బవరం, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కెమెరా: విశ్వాస్‌ డేనియల్‌, ఆర్ట్‌: సుధీర్‌ మాచర్ల,  ఎడిటింగ్‌: సంతోష్‌ నాయుడు చేస్తున్నారు. 

ఈ సినిమా క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న థియేటర్లలో విడుదల కానుంది. 


Related Post

సినిమా స‌మీక్ష