జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా చేసిన ‘దేవర’లోని ‘చుట్టమల్లె’ పాటను ఏఐతో వీడియో మార్ఫింగ్ చేసి ఆమెను అశ్లీలంగా చూపినందుకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. జాన్వీ కపూర్‌కు సంఘీభావం తెలుపుతూ సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెడుతున్నారు.
అయితే ఈ ఘటనను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా పరిగణించి కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలుపెట్టారు.
కానీ ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడేవారిని కటినంగా శిక్షించేందుకు చట్టాలు ఉన్నప్పటికీ, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చాలా సంక్లిష్టమైనది కావడం, నిందితులు ప్రపంచంలో ఎక్కడి నుంచయినా ఇలాంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున సైబర్ క్రైమ్ నేరస్తులు శిక్షలు పడకుండా తప్పించుకోగలుగుతున్నారు.
కనుక హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసుని చేదించి ఈ అశ్లీల పాటని రూపొందించి విడుదల చేసిన వ్యక్తి లేదా వ్యక్తులను పట్టుకొని, శిక్షపడేలా చేయగలిగితే ఇటువంటి నేరాలు చేసేందుకు మరెవరూ సాహసించరు.