ఏషియన్ గేమ్స్ 2026లో భారత ఆర్చర్లు సత్తా చాటుతున్నారు. తాజాగా మిక్స్‌డ్ కాంపౌండ్ విభాగంలో భారత్‌కు మరో స్వర్ణ పతకం దక్కింది.
దక్షిణ కొరియాతో జరిగిన ఉత్కంఠ పోరులో చికిత తానిపర్తి, సాహిల్ రాజేశ్ జాదవ్ విజయం సాధించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు.
దీంతో వీరు భారత్ బంగారు పతకం సాధించడమే కాదు.. ఈ విజయంతో నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించగలిగారు. కనుక వారికి ఇది డబుల్ విక్టరీ అన్న మాట!
అంతకుముందు మహిళల విభాగంలోనూ చికిత తానిపర్తి గోల్డ్ మెడల్ సాధించారు. చైనాతో జరిగిన ఫైనల్‌లో ప్రీతిక, చికిత తానిపర్తి, జ్యోతి సురేఖతో కూడిన భారత జట్టు 238-234 తేడాతో విజయం సాధించింది.
ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతకాల జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 54 పతకాలు చేరాయి. వీటిలో 8 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్య పతకాలు ఉన్నాయి. సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఏషియన్ గేమ్స్ అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి.