ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీతో సిఎం రేవంత్ రెడ్డి మ్యాచ్!

December 11, 2025
img

అర్జెంటీనా ఫుట్‌బాల్ మాంత్రికుడు లియోనెల్ మెస్సీ తొలిసారి భారత్‌ పర్యటనకి వస్తున్నారు. గోట్ ఇండియా టూర్ 2025’ పేరుతో డిసెంబర్ 13 నుంచి 15 వరకు మూడురోజుల పాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. 

ప్రపంచ ఫుట్‌బాల్‌లో మెస్సీ అత్యద్భుత ప్రదర్శనను ఒక్కసారి చూస్తే చాలు... ఫుట్‌బాల్‌ గురించి పెద్దగా తెలియనివారు సైతం ఆయన అభిమానులుగా మారిపోతారు. అందుకే ఆయనని గోట్ (గ్రేటస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అని ముద్దుగా పిలుచుకుంటారు. 

బెంగాలీలు ఫుట్‌బాల్‌ అంటే ప్రాణం పెడతారు. కనుక మేస్సీ ముందుగా డిసెంబర్ 13న కోల్‌కతాలో పర్యటించి అక్కడ అభిమానులతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడతారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌ చేరుకుంటారు. ఆరోజు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో మేస్సీ ఆడతారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా మెస్సీతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడతారు. అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన మెస్సీ, భారత్‌లో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి     ఫుట్‌బాల్‌ ఆడటం చాలా గొప్ప విషయమే కదా?

సిఎం రేవంత్ రెడ్డి ఈ మ్యాచ్‌లో పాల్గొనబోతున్నట్లు ధృవీకరిస్తూ శ్రేయాస్ మీడియా సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది. శనివారం రాత్రి 7గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ మొదలవుతుంది     

డిసెంబర్ 14న ముంబైలో, 15న ఢిల్లీ ఈవెంట్లతో మెస్సీ భారత్‌ టూర్ ముగియనుంది. మెస్సీతో పాటు సుయారెస్, డీ పాల్ రావచ్చన్న సమాచారం అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపుతోంది.

Related Post