హెచ్‌సీఏ ఛైర్మన్‌ జగన్‌మోహన్ రావుపై సస్పెన్షన్ వేటు

August 01, 2025
img

హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. జూలై 28న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆయనతో పాటు కార్యదర్శి డెవరాజ్, కోశాధికారి శ్రీనివాసరావుపై కూడా అపెక్స్ కౌన్సిల్ వేటు వేసింది. వీరు ముగ్గురూ నిధులు, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు సీఐడీ విచారణ జరుపుతున్నందున ముగ్గురినీ సస్పెండ్ చేస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది. వీరి సస్పెన్షన్స్ తక్షణం అమలులోకి వస్తాయని అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. 

హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌లో అవినీతి ఆరోపణలపై దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు తాత్కాలికంగా జస్టిస్ నవీన్ రావుకి హెచ్‌సీఏ బాధ్యతలు అప్పగించింది. కనుక ఆయన అనుమతితోనే అపెక్స్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు లేకుంటే ఈ సస్పెన్షన్స్ మరో వివాదంగా మారే అవకాశం ఉంటుంది.

Related Post