వేణు ఎల్దండి తెలంగాణ నేపధ్యంతో తీయబోతున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో మొదట నితిన్ హీరో అనుకున్నారు. కానీ చాలా కాలంగా సినిమాలలో నటించాలని ఉవ్విళ్ళూరుతున్న ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆయన స్థానంలో ‘పార్షి’గా నటిస్తున్నారు. సంక్రాంతి పండుగనాడు విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్‌లో ‘దేవీశ్రీ ప్రసాద్’ని చూపారు. ఓ చెరువు సమీపంలో ఉన్న చెట్టు మొదలుకి పిడి బాకు గుచ్చి ఉండగా, వర్షంలో రాయిపై దేవీశ్రీ ప్రసాద్ కూర్చున్నట్లు చూపారు.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతంల్ దేవీశ్రీ ప్రసాద్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాత దిల్ రాజు చెప్పారు.