ఒంటరిగా ఉన్నారా? అయితే ఇది మీ కోసమే!

March 18, 2026
img

ఒంటరిగా ఉన్నారా? అయితే ఇది మీ కోసమే! అంటూ సోషల్ మీడియాలో రకరకాల యాప్స్ పుట్టుకొస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా ఒంటరిగా ఉంటున్న యువకులను టార్గెట్ చేసుకొని డేటింగ్ యాప్స్ పేరుతో హనీ ట్రాప్ యాప్స్ చాలానే ఉన్నాయి.

అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడాలని ఉందా? అయితే ఈ డేటింగ్ యాప్ మీ మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోండి. పూర్తిగా ఉచితం... ఒంటరి జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయండి...” అంటూ సోషల్ మీడియాలో ఊరించే ప్రకటనలు చూసి మోసపోవద్దని హైదరాబాద్‌ సీపీ విసి సజ్జనార్‌ హెచ్చరించారు.

సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఇటువంటి ఆకర్షణీయమైన యాడ్స్ వెనుక సైబర్ నేరగాళ్ళు మాటువేసి ఉంటారని హెచ్చరించారు. అందమైన అమ్మాయిల మాయమాటలకు పడి ఆ లింక్స్ క్లిక్ చేసినా ప్రమాదమే.

ఒకవేళ నిజంగానే ఆ డేటింగ్ యాప్స్ ద్వారా అమ్మాయిలతో మాట్లాడినా మీకే ప్రమాదం. ఇదొక హనీట్రాప్... ఆ ట్రాప్‌లో చిక్కుకోకుండా యువత జాగ్రత్తగా ఉండాలని విసి సజ్జనార్‌ హెచ్చరించారు.

సరదాగా సెక్సీ కబుర్లతో మొదలయ్యే ‘హనీట్రాప్‌’లో కూడా మన ఆడియో వీడియో సంభాషణలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు కోసం డిమాండ్ చేస్తారు.

మన ఫోన్లకు అపరిచితులు పంపే లింక్స్ ప్రెస్‌ చేస్తే సైబర్ నేరగాళ్ళు మన ఫోన్లు హ్యాక్ చేసి మన బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ చేసేస్తారు.

అంతేకాదు.. మన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఫోన్ నంబర్లు, వారితో జరిపిన చాటింగ్, ఫోటోలు, వీడియోలు అన్నిటినీ హ్యాక్ చేసి అందరినీ ఇలాగే ట్రాప్ చేస్తారు.

కనుక యువత, ఒంటరిగా ఉన్న మధ్యవయస్కులు, వృద్ధులు ప్రతీ ఒక్కరూ సైబర్ మోసాల పట్ల అవగాహన పెంచుకొని వాటికి దూరంగా ఉండటం చాలా అవసరం. లేకుంటే జీవితాలు తారుమారు అయిపోయే ప్రమాదం ఉంటుందని సిపీ విసి సజ్జనార్‌ హెచ్చరిస్తున్నారు.

"ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు." అంటూ సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్న ఈ యాడ్స్ వెనుక ఉన్నది తీయటి మాటలు కాదు.. నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్ల ఉచ్చు.

యువత… pic.twitter.com/gl9bJcJQi5
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 17, 2026

Related Post