ఆర్డర్ కాపీ చూపితే ఇప్పుడే రాజీనామా: కేటీఆర్‌

March 17, 2026


img

తెలంగాణ శాసనసభలో నేను అధికార కాంగ్రెస్‌, విపక్ష బీఆర్ఎస్‌ పార్టీ సభ్యుల మద్య వాడివేడిగా చర్చలు సాగుతున్నాయి. డెప్యూటీ సిఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేదలకు రూ.57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చిందని చెప్పారు. 

దీనిపై బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌ స్పందిస్తూ, “మీరు 40,000 కోట్లు కాదు 57,000 కోట్లు రుణాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. వారు 57,000 కోట్లు రుణాలు ఇచ్చిన మాట వాస్తవమే అయితే ఇప్పుడే దాని ఆర్డర్ కాపీ చూపించమనండి. నేను ఇప్పుడే నా పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను. ఒకవేళ చూపించకపోతే ఆయన రాజీనామా చేయాలి,” అని కేటీఆర్‌ సవాలు విసిరారు.

 కానీ మంత్రి భట్టి స్పందించకపోవడంతో మళ్ళీ కేటీఆర్‌ మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇలాంటి అబద్దాలతో ప్రజలని, చివరికి శాసనసభని ఏవిధంగా తప్పు దారి పట్టిస్తోందో అర్ధమవుతోంది. ఆర్ధిక మంత్రిగా ఉన్న మీరు ఇలా అబద్దాలు చెప్పడం సబబు కాదు,” అని కేటీఆర్‌ హితవు పలికారు. 


Related Post