జన నాయకుడు ట్రైలర్!

January 04, 2026
img

కోలీవుడ్‌ హీరో దళపతి విజయ్ సినీ పరిశ్రమని వీడి రాజకీయాలలో ప్రవేశించే ముందు చివరిగా చేసిన ‘జన నాయకుడు’ ట్రైలర్‌ నిన్న విడుదల చేశారు. ట్రైలర్‌ చూసినప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ రీమేక్ చూస్తున్నట్లనిపిస్తే ఆశ్చర్యం లేదు.    

గత ఏడాది విజయ్ ‘తమిళక వెట్రి కజగం’ అనే పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించారు. రాబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికలలో పోటీ చేస్తామని ప్రకటించారు. కనుక ఇది ఆయన రాజకీయ ప్రమోషన్ చిత్రంగా రూపొందించుకున్నారు. 

ఈ సినిమాలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మామిత బైజు, గౌతం వాసుదేవ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నారాయణ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.   

ఈ సినిమాకు హెచ్ వినోద్, సంగీతం: అనిరుధ్, కెమెరా: సత్యన్ సూరయన్, యాక్షన్: ఏఎన్ఎల్ అరసు, ఆర్ట్: వీ. సెల్వకుమార్, ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ, కొరియోగ్రఫీ: శేఖర్ విజే సుదన్ చేశారు. 

జనవరి 9న సంక్రాంతి పండుగకు ముందు విడుదలవుతున్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సహ నిర్మాతలు జగదీష్ పళని స్వామి, లోహిత ఎన్‌కెలతో కలిసి వెంకట్ కె నారాయణ నిర్మించారు.         


Related Post