అఖండ-2తో రాజాసాబ్, శంకరవర ప్రసాద్ కూడా?

December 07, 2025


img

బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌లో చాలా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా అఖండ-2 ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వలన ఈ నెల 5కి మారింది. కానీ ఇప్పుడు కూడా చివరి నిమిషంలోవాయిదా పడింది. 

ఈ సమస్యని పరిష్కరించేందుకు సినీ పెద్దలు ఫైనాన్షియర్‌తో మాట్లాడుతున్నారు. చర్చలు సఫలం అయితే ఈ నెల 12, 19 లేదా 25న క్రిస్మస్ పండగ రోజున అఖండ-2 విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

కానీ అఖండ-2 వంటి పెద్ద సినిమాతో క్లాష్ అవకూడదనే చిన్న సినిమాలు దాని ప్రకారమే రిలీజ్ డేట్ ముందుగా ప్లాన్ చేసుకొని ప్రమోషన్స్‌, రిలీజ్ ఏర్పాట్లు చేసుకుంటారు. 

ఈ నెలలో మరికొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. జనవరి 9న రాజాసాబ్, జనవరి 14న మన శంకరవర ప్రసాద్ గారు వస్తున్నారు. రెండూ పెద్ద సినిమాలు కనుక ముందుగానే తగినంత గ్యాప్ ఉంచుకొని రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. 

వాటిని బట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారీ, జన నాయకుడు, పరాశక్తి సినిమాలు సంక్రాంతికి డేట్స్ ఖరారు చేసుకొని సిద్దం అవుతున్నాయి.

కానీ ఇప్పుడు అఖండ-2 డిసెంబర్‌ నెలాఖరుకి వస్తే ఈ సినిమాలన్నిటిపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. కనుక వాటిలో వాయిదా వేసుకోవాల్సిన సినిమాలు ఎలాగూ నష్టపోతాయి. 

అంతే కాదు... అవి వాయిదా పడితే, వాటి తర్వాత రిలీజ్ కావాల్సిన సినిమాలపై కూడా ప్రభావం పడుతుంది. కనుక ఈసారి అఖండ-2 రిలీజ్ కాకుండా సినీ పరిశ్రమలో అఖండ తాండవం మొదలైంది. ఎవరెవరు ఎంత మూల్యం చెల్లించబోతున్నారో?


Related Post

సినిమా స‌మీక్ష