అమితాబ్ బచ్చన్ శేష జీవితం అయోధ్యలో?

March 07, 2026
img

దేశంలో సీనియర్ నటులలో అమితాబ్ బచ్చన్ ఒకరు. 83 ఏళ్ల వయసులో కూడా నేటికీ అయన ఏదో ఓ సినిమాలోనో వాణిజ్య ప్రకటనలలోనో నటిస్తూనే ఉంటారు. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ వంటి క్విజ్ ప్రోగ్రాములలో కూడా హోస్ట్‌గా చేస్తూ క్షణం తీరిక లేని జీవితం గడుపుతుంటారని అందరికీ తెలుసు.

ఆయన తన స్వరాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో అయోధ్య నగరంలో శేష జీవితం గడిపేందుకు లేదా ఖాళీ సమయంలో గడిపేందుకుగాను ఓ భవంతి నిర్మించుకోబోతున్నట్లు సమాచారం.

దీని కోసం అయన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లోదాకు చెందిన ‘సరయూ ప్రాజెక్ట్’లో రూ.35 కోట్లు ఖర్చు చేసి 2.67 ఎకరాలు కొనుగోలు చేశారు. అమితాబ్ బచ్చన్ అయోధ్యలోనే మరో స్థలం కూడా కొన్నట్లు తెలుస్తోంది. వీటి గురించి అయన ఇంకా మీడియాకు వివరించాల్సి ఉంది. 


Related Post