విడాకులు కావాలి కానీ కలిసే ఉంటాము: సంగీత!

March 07, 2026
img

కోలీవుడ్‌ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి ఆయన భార్య సంగీత విడాకుల నోటీస్ పంపిన సంగతి తెలిసిందే. నేడు ఆమె మరో పిటిషన్‌ వేశారు. విడాకులు కేసు విచారణ పూర్తయ్యేవరకు తాను తమ కుమారుడితో కలిసి భర్త విజయ్ ఉంటున్న ఇంట్లోనే ఉండాలనుకుంటున్నానని దానిలో పేర్కొన్నారు. ఆ ఇంటిపై తనకు కూడా సమాన హక్కులు ఉన్నందున దానిలో నివసించేందుకు అనుమతించాలని ఆమె పిటిషన్‌ ద్వారా కోర్టుని అభ్యర్ధించారు.

ప్రస్తుతం ఆమె లండన్‌లో ఉంటున్నారు. అక్కడి నుంచే న్యాయవాదుల ద్వారా ఆమె భర్త నుంచి విడాకులు కోరుతూ ఫిభ్రవరి 24న చెంగల్పట్టు ప్రధాన సెషన్స్ కోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై ఏప్రిల్‌ 20న విచారణ జరుగబోతోంది. దానికి విజయ్ స్వయంగా హాజరవ్వాలని న్యాయస్థానం నోటీస్ పంపింది. ఈలోగా నేడు ఈ పిటిషన్‌ వేశారు.

విజయ్ ఆమెకు భరణంగా రూ.250 కోట్లు ఆఫర్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అవే నిజమైతే చెన్నైలోని ఆ ఇంటి కోసం ఆమె ప్రాకులాడాల్సిన అవసరం లేదు కదా? కానీ ఇంటిని దక్కించుకోవడానికే ఆమె ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారా లేక చివరి ప్రయత్నంగా భర్తని త్రిషకు దూరంగా ఉండాలని నచ్చజెప్పి మళ్ళీ తన కాపురం చక్కబెట్టుకోవాలనుకుంటున్నారో? ఎలాగూ త్వరలో మీడియా ముందుకు వస్తారు కనుక ఈ తాజా పిటిషన్‌ ఉద్దేశ్యం ఏమిటో ఆమె నోటితోనే వినవచ్చు.

Related Post