హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ స్టూడియోస్ కార్యాలయం

March 07, 2026
img

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ వచ్చింది. అదే... భారత్‌లోని నం.1 ఓటీటీ సంస్థగా పేరొందిన నెట్‌ఫ్లిక్స్‌. భారత్‌లో ముంబాయి తర్వాత రెండో కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు కాబోతోంది.

హైదరాబాద్‌లో 30,000 చ.అడుగుల విస్తీర్ణంలో నెట్‌ఫ్లిక్స్‌ స్టూడియోస్ కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. దీనిని ఈ నెల 12న సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కలిసి ప్రాభోత్సవం చేయనున్నారు. 

నెట్‌ఫ్లిక్స్‌ భారత్‌లో ప్రవేశించి పదేళ్ళు పూర్తయింది. ఓటీటీలో సినిమాలు, వెబ్‌ సిరీస్ అందిస్తుండటమే కాక వీఎఫ్ఎక్స్ రంగంలో కూడా నెట్‌ఫ్లిక్స్‌ ఉంది. సొంతంగా అనేక  సినిమాలు, వెబ్‌ సిరీస్ నిర్మిస్తూ నిర్మాణ రంగంలో కూడా ఉంది.

కనుక సినీ పరిశ్రమలో 14 విభాగాలలో నెట్‌ఫ్లిక్స్‌ ఉంది. కనుక నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ఈ రంగంలో విభాగాలలో నిపుణులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. 

Related Post