వృషకర్మ గ్లిమ్స్‌ చూశారా?

March 05, 2026


img

కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా చేస్తున్న ‘వృషకర్మ’ గ్లిమ్స్‌ ఈరోజు మధ్యాహ్నం 12.12 గంటలకు హైదరాబాద్‌లోని ప్రసాద్ పీసి ఎక్స్‌ప్రెస్‌ స్క్రీన్‌లో విడుదల చేశారు. 

అతీంద్రియ శక్తులు మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు విధి ఒక వృషకర్మని ఎంచుకుంటుంది.... అంటూ చూపిన గ్లిమ్స్‌... అద్భుతంగా ఉంది. దీనిలో అతీంద్రియ శక్తులను మట్టుబెట్టి మానవజాతిని కాపాడే సూపర్ హీరోగా నాగ చైతన్య చేస్తున్నట్లు గ్లిమ్స్‌లో చూపారు.    

ఈ సినిమాలో నాగ చైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాత్సవ్ (‘లాఫతా లేడీస్) ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్‌ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామిగా ఉండటంతో భారీ అంచనాలున్నాయి. ఈ వేసవిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.  


Related Post

సినిమా స‌మీక్ష