తలపై నుంచి భయంకర శబ్దంతో క్షిపణులు దూసుకుపోతుంటే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే అక్కడి నుంచి వీలైనంత దూరంగా పారిపోయి ప్రాణాలు కాపాడుకుంటారు. కదా? కానీ ఇరాక్‌లోని యువత అదేమీ పట్టనట్లు హాయిగా ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు.
ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మద్య భీకర యుద్ధం జరుగుతోంది. గల్ఫ్ దేశాలలో దుబాయ్, అబుదాబీ, బహ్రెయిన్, సౌదీఅరేబియా తదితర దేశాలలో అమెరికా సైనిక స్థావారాలున్నాయి. వాటిపై ఇరాన్ క్షిపణులతో దాడి చేస్తోంది.
ఇరాన్ పక్కనే ఇరాక్ ఉన్నందున అటు అమెరికా-ఇజ్రాయెల్ దళాలు, ఇటు ఇరాన్ దళాలు పరస్పరం ప్రయోగించుకుంటున్న క్షిపణులు ఇరాక్ మీదుగా దూసుకుపోతున్నాయి.
ఇరాక్ ప్రజలకు ఈ యుద్ధం గురించి బాగా తెలుసు కనుక వారు మైదానంలో రాత్రిపూట లైట్స్ వేసుకొని నిశ్చింతగా ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. వారు ఆడుకుంటుంటే, కాస్త దూరంలో కుర్చీలు వేసుకొని కొందరు యువకులు వారి ఆటని, పనిలో పనిగా తలపై నుంచి దూసుకు వెళుతున్న క్షిపణులను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
వారి సమీపంలోనే మరో యువకుడు మైక్ పట్టుకొని వారి ఆట గురించి, పైనుంచి దూసుకు వెళుతున్న క్షిపణుల గురించి రన్నింగ్ కామెంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ చూడండి...
Iraq watching Iran and Israel, USA war pic.twitter.com/PbBdljb4cT