కల్వకుంట్ల కవిత అరెస్ట్.. విడుదల

March 04, 2026


img

తెలంగాణ జాగృతి  అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితని మంగళవారం సాయంత్రం నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత విడిచిపెట్టారు. 

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవం పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్ళు కూల్చేస్తూ, నదీ గర్భంలో పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్న బడా బాబులను ఉపేక్షిస్తోంది. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయంలోనే ఈ నిర్మాణాలకు అనుమతిస్తే, అవి కొనసాగుతుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం చూసీ చూడనట్లు ఊరుకుంటోంది. 

రెండు పార్టీలు, రెండు ప్రభుత్వాలు డబ్బున్నవాళ్ళ కోసమే పనిచేస్తున్నాయి. సిఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం ప్రకారమే హైడ్రా కూల్చివేతలు చేపడుతోంది. సిఎం రేవంత్‌ రెడ్డి... ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వ ద్వందవైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాను. 

మేము న్యాయం కోరుతూ శాంతియుతంగా ధర్నా చేస్తుంటే, ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేయించింది. కానీ ఈ కేసులు, అరెస్టులతో మమ్మల్ని ఆపలేదు. పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. దీనిపై జాగృతి న్యాయపోరాటం కూడా చేస్తుంది,” అని కల్వకుంట్ల కవిత అన్నారు. 

 


Related Post