రాజమౌళి టీమ్‌ త్వరలో అంటార్కిటికాకి..

February 05, 2026
img

రాజమౌళి దర్శకత్వం మహేష్ బాబు, ప్రియాంకా చొప్రా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్న ‘వారణాశి’ రిలీజ్ అవడానికి మరో ఏడాదిన్నర పడుతుంది. కానీ ఇప్పటి నుంచే వారణాశి గురించి రాజమౌళి, మహేష్ బాబు స్వయంగా అప్‌డేట్‌ ఇస్తుండటం విశేషం. ఈ సినిమాలో తాను ఓ సన్నివేశంలో శ్రీరాముడుగా నటిస్తున్నట్లు మహేష్ బాబు స్వయంగా చెప్పారు. 

ఈ సినిమాలో నడక, పరుగు, నిలుచునే భంగిమలు, హావభావాలు ఇలా... ప్రతీ చిన్న అంశం కోసం అనేక నెలలపాటు శిక్షణ తీసుకున్నానని, అనేకసార్లు రిహార్సల్స్ చేశానని మహేష్ బాబు చెప్పారు. రాజమౌళితో సినిమా అంటే ఇలాగే కష్టపడాల్సి ఉంటుందని నాకు ముందే తెలుసు. 

కనుక అయన సినిమా చేద్దామని చెప్పినప్పుడు మొదట భయపడ్డాను. కానీ ఆయన చెప్పిన కధ విన్న తర్వాత ఆశ్చర్యపోయాను. పౌరాణికం, సైంటిఫిక్, టైం ట్రావెల్, అడ్వంచర్స్... ఇలా ఒకటేమిటి అన్నీ ఒకే కధలో చాలా అద్భుతంగా ఇమిడ్చేశారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే అందరూ అంగీకరిస్తారు... రాజమౌళి నిజంగా గ్రేట్ అని,” అని మహేష్ బాబు అన్నారు. 

వారణాశి గురించి రాజమౌళి ఏం చెప్పారంటే, “ఈ సినిమా కధ ఫైనల్ చేయగానే మొదట రెండు భాగాలలో తీస్తే బాగుంటుందని అనుకున్నాము. కానీ తర్వాత మూడు గంటల నిడివితో ఒక్క భాగంగానే తీయాలని నిర్ణయించుకున్నాము. 

మహేష్ బాబుతో ఓ సినిమా చెపాలని 15 ఏళ్ళ క్రితమే అనుకున్నాను. కానీ ఇద్దరం వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండటంతో ఇప్పటికి కుదిరింది.

 ఈ మూడు గంటల సినిమాలో రామాయణంలో ఓ ముఖ్య భాగం ఉంటుంది. ఆ సన్నివేశం 25 నిమిషాలపాటు ఉంటుంది. వారణాశిలో కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించేందుకు త్వరలో అంటార్కిటికాకు బయలుదేరబోతున్నాం,” అని చెప్పారు. 

ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా ప్రకాష్ రాజ్, విలన్‌ కుంభగా మలయాళ నటుడు పృద్విరాజ్ సుకుమారన్, మందాకినిగా బాలీవుడ్‌ సీనియర్ నటి ప్రియాంకా చొప్రా నటిస్తున్నారు.            

ఈ సినిమాకి కధ: విజయేంద్ర ప్రసాద్, డైలాగ్స్: దేవకట్ట, సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, పిఎస్ వినోద్, వీఎఫ్ఎక్స్‌: శ్రీనివాస్ మోహన్, సందీప్ కమల్‌, మోహన్ నాథ్ బింగి చేస్తున్నారు. 

ఆర్ట్: సందీప్ సువర్ణ, ఎడిటింగ్: బిక్కిన తమ్మరాజు, స్టంట్స్: కింగ్ సోలోమన్, లైన్ ప్రొడ్యూసర్: ఎంఎం శ్రీవల్లి, కాస్ట్యూమ్స్: రమ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ: ప్రొడక్షన్ మేనేజ్ మెంట్ చేస్తున్నారు. 

శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ కలిసి సుమారు రూ.1,100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా  నిర్మిస్తున్నారు. 2027 ఏప్రిల్‌ 7న వారణాశి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 

Related Post