గాయపడ్డ సింహం.. నందమూరి బాలకృష్ణ!

July 21, 2026


img

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న ఎన్బీకే 111 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కాకినాడ పోర్టు పరిసరాల్లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నప్పుడు బాలయ్యకు స్వల్ప గాయం అయ్యింది. 

యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో కాలికి కండరాలకు స్వల్పంగా గాయం అయ్యింది. యూనిట్ సభ్యులు వెంటనే ఆయనను కాకినాడలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేశారు. ప్రస్తుతానికి పర్వాలేదు కానీ దీని వలన మళ్ళీ సమస్య రాకూడా నివారించేందుకు చిన్న శస్త్ర చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. బాలయ్య ఆరోగ్యం బాగానే ఉందని కనుక ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. 

కాకినాడ పోర్టులో బాలయ్య, మంచు మనోజ్ పాల్గొంటున్న యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.  

బాలయ్య వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు బాలయ్య విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది కనుక ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ షూటింగ్‌ మొదలుపెడతామని దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపారు. 

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో సూపర్ హిట్ 'వీరసింహారెడ్డి' తర్వాత ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. కనుక దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. 



Related Post

సినిమా స‌మీక్ష