ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ శ్రీరాముడుగా, సాయిపల్లవి సీతమ్మవారిగా, ‘రామాయణ’ సిద్దం అవుతోంది.
రెండు భాగాలుగా రూపొందుతున్న రామాయాణలో మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల కాబోతోంది. రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదలవుతుంది.
రామాయణలో లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడుగా కన్నడ నటుడు యష్ నటిస్తున్నారు.
శనివారం ఢిల్లీలో ‘ప్రథమ్ సంకల్ప్’ పేరుతో కార్యక్రమం నిర్వహించి ట్రైలర్ ప్రదర్శించారు. ఈ నెల 24న మరో ట్రైలర్ లేదా దీని పూర్తి ట్రైలర్ విడుదల చేస్తారు. నిన్న విడుదల చేసిన ట్రైలర్‌లో హనుమంతుడు లంకాదహనం సన్నివేశంతో మొదలుపెట్టడం విశేషం.
ఈ సినిమాకు కధ: శ్రీధర్ రాఘవన్, దర్శకత్వం: నితీష్ తివారీ, సంగీతం: ఏఆర్ రహమాన్, హాన్స్ జిమ్మర్, వీఎఫ్ఎక్స్: డిఎన్ఈజీ (8సార్లు ఆస్కార్ అవార్డ్ గ్రహీత).