నితిన్‌ కూడా అదే ఫాలో అయిపోతాడట!

July 18, 2026


img

యువ నటుడు నితిన్‌ హీరోగా రాము, సోము దర్శకత్వంలో సితారా ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ‘దండోరా’తో హిట్ కొట్టిన మురళీకాంత్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.

నేచురల్ స్టార్ నాని సొంత బ్యానర్‌ ‘వాల్ పోస్టర్‌’పై దీనిని నాని స్వయంగా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే విఐ ఆనంద్ దర్శకత్వంలో నితిన్‌ మరో సినిమా చేయబోతున్నారు. దీనిని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి  నిర్మించబోతున్నారు. 

రాబిన్ హుడ్, తమ్ముడు రెండూ నిరాశ పరిచినా నితిన్‌ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తుండటం మంచి నిర్ణయమే.

ఇప్పుడు కొత్త సినిమాల ప్రకటన సమయంలోనే ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల చేయడమనే ట్రెండ్ నడుస్తోంది.

కనుక నితిన్‌ కూడా తన సినిమాలకు ఈ ట్రెండ్ ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం మురళీకాంత్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకి సంబంధించి ఫస్ట్ గ్లిమ్స్‌ షూటింగ్‌లో నితిన్‌ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.


Related Post

సినిమా స‌మీక్ష