దర్శకుడు ఎస్‌కే బషీద్ తెరకెక్కించిన హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ 'అమెన్' ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఎస్‌బీకే ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని రేగుల నీరజారాణి సమర్పణలో ఆర్‌ఎన్‌ఆర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ ఈ సినిమా విడుదల చేయబోతోంది
ఈ సినిమా ఆమెన్ గురించి దర్శకుడు ఎస్‌కే బషీద్ వివరిస్తూ, “ఈ సినిమాతో ప్రేక్షకులకు హార్రర్ అంటే ఏవిధంగా ఉంటుందో పరిచయం చేయబోతున్నాను. కనుక గుండె ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ సినిమా చూడగలరు. కానీ ఒంటరిగా ఈ సినిమా చూసే ధైర్యం ఎవరికీ ఉండదని చెప్పగలను.
ఇదొక భయానక హర్రర్, థ్రిల్లర్, సస్పెన్స్ సినిమా. కనుక గుండె జబ్బులున్నవారు ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సినిమాలో నూతన నటీనటులను పరిచయం చేస్తున్నామని,” దర్శకుడు బషీద్ చెప్పారు.
ఈ ఎఫెక్ట్ కోసం సరికొత్త టెక్నాలజీని ఉపయోగించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇటీవల విడుదలైన పోస్టర్‌కు మంచి స్పందన లభించగా, త్వరలో ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఆమెన్ జులై 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.