సతీష్ ఆవల దర్శకత్వంలో దినేష్, దివిజ ప్రభాకర్, సుధ, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రలు చేసిన వెంకటరమణగారి తాలూకా ట్రైలర్ విడుదలైంది. ఓ సామాన్య కుటుంబంలో తలెత్తే సమస్యలను కధాంశంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమాలో మురళీధర్ గౌడ్ వెంకట్రామయ్య పాత్ర చేశారు.
ఈ సినిమాలో ఇతర నటీనటులు: దినేష్, దివిజ ప్రభాకర్, సత్య శ్రీ, హషిణి, మిర్చి మాధవి, జీవన ప్రియ, గౌరీ నాయుడు, ఆమని, నీసర్, కృష్ణంరాజు, ప్రకాశ్, ఇక్బాల్, హరీష్ టెక్కలి, సంతు ముంజేటి, శివ, సుబ్బు, కార్తీక్.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సతీష్ అవల; సంగీతం: చరణ్ అర్జున్; కెమెరా: అనిల్ కుమార్;
కొరియోగ్రఫీ: సాగర్ మాస్టర్; ఎడిటింగ్: మార్తాండ కె. వెంకటేష్; ఆర్ట్ డైరెక్టర్: రమేష్ సరగడం చేశారు.
తొట్టె మహేందర్ కోమల, సోమేశ్ సరిపల్లి కలిసి ఈ సినిమా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.