28మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాకి సిద్ధం!

July 14, 2026

img

కన్నెపల్లి పంపులు ఆన్‌ చేసి అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌లలో నీళ్ళు నింపాలంటూ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేస్తున్న బీఆర్ఎస్‌ పార్టీ, ఈసారి ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దపడింది.

సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి హుజురాబాద్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు.

తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ రెండు బ్యారేజీలలో నీళ్ళు నింపండి. మాలో కొందరు కన్నెపల్లి పంప్  హౌస్ ద్ద, కొందరు అన్నారం వద్ద, మిగిలినవారు సుందిళ్ళ వద్ద కూర్చుంటాము.  మీరు చెపుతున్నట్లు బ్యారేజీలకు ఏదైనా నష్టం జరిగితే దానికి మేమే పూర్తి బాధ్యత వహిస్తాము. వాటిలో ఏఒక్కటి ఒక్క ఇంచ్ దెబ్బ తిన్నా, 28 మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తాం. మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయబోము.

కనుక రెండు బ్యారేజీలలో నీళ్ళు నింపండి. ఎవరు నిజం చెపుతున్నారో... ఎవరు అబద్దాలు చెపుతున్నారో తాడో పేడో తేలిపోతుంది, అంటూ సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలకి సవాలు విసిరారు. దీనిపై వారిరువురూ ఏవిధంగా స్పందిస్తారో?

మొదట్లో మేడారంలో కూడా నీళ్ళు నింపాలని పట్టుబట్టిన బీఆర్ఎస్‌ నేతలు, దానిని విడిచిపెట్టి అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌లలో మాత్రమే నీళ్ళు నింపాలని పట్టుబడుతుండటం గమనిస్తే మేడారం బ్యారేజ్ ప్రమాదకర పరిస్థితిలో ఉందనే కాంగ్రెస్ ప్రభుత్వ వాదనలను అంగీకరించినట్లే భావించవచ్చు. కానీ అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు ఏదైనా నష్టం జరిగితే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావులతో 28 మంది  ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తామని సవాళ్ళు విసురుతుండటం గమనిస్తే, ఆ రెండు బ్యారేజీలు పటిష్టంగా ఉన్నాయని వారు ధ్రువీకరించుకున్నట్లు అర్ధమవుతోంది. మరి బీఆర్ఎస్‌ సవాలుని కాంగ్రెస్‌ ప్రభుత్వం స్వీకరిస్తుందా? లేదా?

కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వెంటనే గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసి రైతులకు నీళ్లివ్వండి.

అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఏమాత్రం చిన్న సమస్య వచ్చినా..
మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం బాధ్యత తీసుకుని రాజీనామా చేస్తాం, రాజకీయాలకు దూరంగా ఉంటాం.

- కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే… pic.twitter.com/Sai6xnYjd3
— BRS Party (@BRSparty) July 14, 2026

Related Post