ఈటీవీ విన్‌లోకి తెల్ల కాగితం.. ఎప్పటి నుంచంటే..

October 25, 2026


img

హర్ష రోహాన్, నక్షత్ర జంటగా చేసిన ‘తెల్ల కాగితం’ భారీ అంచనాలతో అక్టోబర్‌ 2న విడుదలైంది. కానీ ఇది కూడా హర్ష్  రోహాన్ నటించిన ‘బ్యాండ్ మేళం’లా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కనుక నెలరోజులు కాక మునుపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 29 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది.  

అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: నందు సవిరిగన, సంగీతం: విజయ్‌ బుల్గానిన్, కెమెరా: కేవీ గుహన్, కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి, ఎడిటింగ్: ఆర్‌. కార్తీక శ్రీనివాస్ చేశారు.

టీనేజ్ వయసులో ఆకర్షణలను ప్రేమ అనుకుంటూ ఆ వ్యామోహంలో కాలు జారితే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయనే సామాజిక సమస్యను తీసుకొని ఈ సినిమా తెరకెక్కించినప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ తెల్ల కాగితంపై వారు ఎలాంటి తీర్పు వ్రాస్తారో? 


Related Post

సినిమా స‌మీక్ష