ఇడుపు కాయితం నుంచి ప్రతీ ఇంటి గడప పాట

October 23, 2026


img

వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో ఈ సినిమాలో ప్రియదర్శి తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’ నుంచి ప్రతీ ఇంటి గడప అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ నేడు విడుదలైంది. పెళ్ళయిన తర్వాత నూతన వధువు భర్తతో కలిసి తొలిసారిగా అత్తగారింట్లో అడుగు పెడుతున్నప్పుడు ఆమెలో కలిగే భావోద్వేగాలు, ఆ సందర్భంగా తెలంగాణ సంప్రదాయాలను ఈ పాటలో చాలా చక్కగా చూపారు. ఈ సినిమా నాగదుర్గ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ప్రియదర్శి, నాగదుర్గ జంట చాలా సహజంగా కనిపిస్తున్నారు.

తెలంగాణలో భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే దానినే ‘ఇడుపు కాయితం’గా పేర్కొంటారు. కనుక ఇది భార్యాభర్తల అనుబంధం, కుటుంబ సంబంధాలు, వారు విడిపోయే పరిస్థితిలో కుటుంబంలో నెలకొనే భావోద్వేగాలు ఈ సినిమాలో చూపబోతున్నారు.  

సుకుమార్ రైటింగ్స్, బీవీ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్, వంశీ రెడ్డి దొండపాటి, సురేష్ బొబ్బిలి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 11న థియేటర్లలో విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష