నేడు డార్లింగ్ పుట్టినరోజు.. అభిమానులకు కల్కి, ఫౌజీ కానుకలు!

October 23, 2026


img

పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్టార్‌గా ఎదిగిన మన డార్లింగ్ ప్రభాస్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అయన నటిస్తున్న ఫౌజీ, కల్కీ ఏడీ 2898 సినిమాల నుంచి అభిమానులకు కానుకలు వచ్చాయి. 

హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమాలో ప్రభాస్‌ బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన వీరుడుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆ తిరుగుబాటు వీరుడికి సంబంధించిన అత్యంత రహస్యమైన ఫైల్ నంబర్: 25ని నేడు బయటపెట్టబోతున్నామంటూ ఓ ఫోటో పెట్టారు. దానిలో ‘మోస్ట్ వాంటడ్‌’ అంటూ ప్రభాస్‌ బొమ్మ నాణెం దాని వెనుక మంటలు ఉన్నాయి. ఈ ఫైలులో పేర్కొన్న ఆ అజ్ఞాత వీరుడు ఎవరు?అనే విషయం మరికొద్ది సేపటిలో ఓ వీడియో ద్వారా తెలియజేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ తెలియజేసింది. 

ఇక కల్కీ ఏడీ 2898 నుంచి ‘భైరవ్ ఈజ్ బ్యాక్’ అంటూ చిన్న వీడియో క్లిప్ వదిలారు. సలార్-2 దర్శకుడు ప్రశాంత్ నీల్-ప్రభాస్‌తో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ప్రభాస్‌ పోస్టర్‌ విడుదల చేశారు.   


Related Post

సినిమా స‌మీక్ష