సూపర్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’, బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ రెండు భారీ బడ్జెట్ సినిమాలు చేశారు. కానీ వాటిలో ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ అవగా, ‘పెద్ది’ సినిమా కలెక్షన్స్ బాగానే రాబట్టినప్పటికీ మిశ్రమ స్పందన తెచ్చుకొని నిరాశ పరిచింది.
కనుక రామ్ చరణ్‌కు ‘రంగస్థలం’ వంటి సూపర్ డూపర్ హిట్ అందించిన సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఆర్సీ-17 వర్కింగ్ టైటిల్‌తో మొదలు పెట్టాబోతున్న ఈ సినిమా గురించి నిర్మాత రవిశంకర్ ఓ అప్డేట్ ఇచ్చారు. దసరా రోజునే సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నామని కానీ అక్టోబర్ 26 లేదా 27 తేదీల్లో సినిమా పూజా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాత వీలైనంత త్వరగా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని తెలిపారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు పూజా కార్యక్రమం తర్వాత ప్రకటిస్తారు.