కిల్లర్ ట్రైలర్‌ చూశారా?

October 22, 2026


img

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ ట్రైలర్ విడుదలైంది. దర్శకుడు హరీశ్ శంకర్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అక్టోబర్ 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మనిషిని దేవుడుగా మార్చగలిగితే అనే ఆలోచనతో ఓ శాస్త్రవేత్త చేసిన ప్రయోగాల నేపధ్యంలో ఈ సినిమా రూపొందించామని దర్శకుడు పూర్వాజ్ తెలిపారు. కనుక ఈ సైన్స్ ఫిక్షన్, యాక్షన్ సినిమాలో సెకండాఫ్‌లోని ట్విస్ట్‌ను ఎవరైనా ఊహించి చెబితే కోటి రూపాయల బహుమతి ఇస్తామని తెలిపారు. 

ఈ సినిమాలో మనీష్ గిలాడా, విశాల్ రాజ్, అనంత్, చంద్రకాంత్ కోళ్ళు, గౌతం చక్రధర్ కొప్పిశెట్టి, అనంత్, అర్చన తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: జగదీశ్ బొమ్మిశెట్టి, సంగీతం: ఆశీర్వాద్, సుమన్ జీవ అందించారు.  

దర్శకుడు పూర్వాజ్ కూడా ఈ సినిమా నిర్మాతలలో ఒకరు. థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ పతాకాలపై రూపొందిన ఈ సినిమాను పద్మనాభ రెడ్డితో కలిసి నిర్మించారు. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా కిల్లర్ విడుదల కాబోతోంది.  


Related Post

సినిమా స‌మీక్ష