ఈ నెల 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ సభ

October 14, 2026


img

దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపు వివాదం, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఇండియా కూటమి ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. దీనిలో భాగంగా మొదట ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. 

ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో సహా పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు హాజరుకానున్నారు. సుమారు లక్ష మందిని సమీకరించి సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌ లేదా అందుబాటులో ఉన్న చోట ఈ సభ నిర్వహించి విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం పట్టుదలగా ఉంది. 

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఢిల్లీలో రాహుల్‌ గాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో ఈ సభ గురించి చర్చించి నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.

ఢిల్లీలోని ‘జంతర్‌ మంతర్‌’ వద్ద సీజేపీ ఆందోళనలతో తరచూ ఢిల్లీ ప్రజలకు ఇబ్బంది ఎదుర్కొంటున్నందున నిరసనల వేదికల జాబితా నుంచి ‘జంతర్ మంతర్’ని తొలగించింది. దీనిపై కాంగ్రెస్‌, ఇండియా కూటమి, సీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కనుక ఇకపై తమ ఉద్యమాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే హైదరాబాద్‌ ఈ సభ నిర్వహించబోతున్నారు. 


Related Post