తనికెళ్ళ వాయిస్ ఓవర్‌తో.. వృషకర్మ ట్రైలర్‌!

October 14, 2026


img

కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా చేస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్‌ నేడు విడుదలైంది. తల్లి గర్భమే ఓ ప్రపంచం అనుకుంటున్నా ఓ శిశువు ఓ కొత్త ప్రపంచంలో అడుగుపెడితే.. అంటూ తనికెళ్ళ భరణి వాయిస్ ఓవర్‌తో రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. 

ఈ సినిమాలో నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాత్సవ్ (‘లాఫతా లేడీస్) ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్‌ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామిగా ఉండటంతో భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ 4వ తేదీన వృషకర్మ విడుదల కాబోతోంది.   


Related Post

సినిమా స‌మీక్ష